INDW vs SAW : మహిళల టీ20 ప్రపంచకప్ కీలక మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడ్డారు. ఊహించినట్టుగా శుభారంభం లభించకున్నా ఓపెనర్ షఫాలీ వర్మ(31), రాణించింది. దక్షిణాఫ్రికా పేసర్లు మరినే కాప్(2-27), షబ్నం ఇస్మాయిల్(2-28) విజృంభించడంతో మిడిలార్డర్ సైతం ధాటిగా ఆడలేకపోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(24), దీప్తి శర్మలు(29) మెరవడంతో నిర్ణీత ఓవర్లో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
పొట్టి ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన భారత జట్టు మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఎమిరేట్స్ ఓల్ట్ ట్రఫోర్డ్ మైదానంలో దక్షిణాణఫ్రికా బౌలర్లు పవర్ ప్లేలోనే రెండు వికెట్లతో ఒత్తిడిలో పడేశారు. మరినే కాప్ సఫారీలకు బ్రేకిస్తూ డేంజరస్ ఓపెనర్ స్మృతి మంధాన(17)ను బౌల్డ్ చేసింది. ఉన్నంత సేపు దంచేసిన షఫాలీ వర్మ(31)ను షబ్నం ఇస్మాయిల్ బోల్తా కొట్టించింది.
Innings Break!#TeamIndia finish with a competitive 1️⃣5️⃣8️⃣ on the board!
Over to the bowlers now to defend this.
Scorecard ▶️ https://t.co/cIrb7Ekn0x#T20WorldCup | #WomenInBlue | #SAvIND pic.twitter.com/oIfsKjVcOK
— BCCI Women (@BCCIWomen) June 21, 2026
పవర్ ప్లేలోనే ఓపెనర్లు వెనుదిరిగిన వేళ.. యస్తికా భాటియా(15), జెమీమా రోడ్రిగ్స్(12)లు సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో రెండొందల మ్యాచ్ ఆడుతున్న హర్మన్‌ప్రీత్ కౌర్(24) జట్టును ఆదుకోవాలనుకుంది. కానీ, షబ్మమ్ తనను బౌల్డ్ చేయడంతో టీమిండియా స్కోర్ వేగం తగ్గింది. అనంతరం దీప్తి శర్మ(29), రీచా గోష్(15)లు తలా కొన్ని పరుగులు చేశారు. ఫలితంగా ప్రత్యర్థికి 159 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది.