DCW vs RCBW : మహిళల ప్రీమియర్ నాలుగో సీజన్ రెండో డబుల్ హెడర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు.. ఆ తర్వాత మరో రెండు వికెట్లు పడిన వేళ.. వందలోపే కుప్పకూలేలా కనిపించిన ఢిల్లీని ఓపెనర్ షఫాలీ వర్మ(62) విధ్వంస అర్ధ శతకంతో ఆదుకుంది. స్నేహ్ రానా(22) తోడుగా ఇన్నింగ్స్ నిర్మించిన షఫాలీ.. ఆఖర్లో్ హమిల్టన్(36) జతగా స్కోర్ బోర్డును ఉరికించింది. శ్రేయాంక వేసిన 19వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదడంతో ఢిల్లీ స్కోర్ 160 దాటింది. వీరిద్దరి మెరుపులతో ఆర్సీబీకి 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఢిల్లీ.
క్రికెట్లో ముఖ్యంగా టీ20ల్లో సంచలన బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శనలు మామూలే. డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ 11వ మ్యాచ్‌లో అచ్చంగా ఇదే దృశ్యం ఆవిష్కృతమైంది. టాస్ ఓడిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే లారెన్ బెల్(2-5) షాకిచ్చింది. తొలి ఓవర్లోనే డేంజరస్ ఓపెనర్ లిజినే లీ(4)ని ఔట్ చేసిన తను.. ఆ తర్వాతి బంతికే లారా వొల్వార్డ్త్(0)ను క్లీన్‌బౌల్డ్ చేసింది. రెండో ఓవర్లో సయాలీ సత్ఘరే(2-4) తన పేస్ మ్యాజిక్‌తో వరుస బంతుల్లో జెమీమా రోడ్రిగ్స్(4), మరినే కాప్(0)లను బౌల్డ చేసి ఢిల్లీని కష్టాల్లోకి నెట్టింది. తొమ్మిది బంతుల్లో.. 10కే ఆ జట్టు నాలుగు వికెట్లు పడ్డాయి. ఆ దశలో షఫాలీ వర్మ(62) ఒత్తిడిని చిత్తు చేస్తూ సంచలన ఇన్నింగ్స్ ఆడింది.
Shafali storm in Navi Mumbai 🌪️
Can she guide #DC to a strong finish? 🤔
Updates ▶️ https://t.co/NnuH8NcjvD #TATAWPL | #KhelEmotionKa | #DCvRCB pic.twitter.com/Gb3oLTq9zQ
— Women’s Premier League (WPL) (@wplt20) January 17, 2026
పవర్ ప్లేలోనే దాదాపు సగం వికెట్లు తీసిన ఆర్సీబీ బౌలర్లపై షఫాలీ ఎదురు దాడికి దిగింది. బంతిని బలంగా బాదుతూ, అలవోకగా బౌండరీలు సాధిస్తూ ఢిల్లీని గట్టెక్కింది. నిక్కీ ప్రసాద్ (12), స్నేహ్ రానా(22), ఆఖర్లో హామిల్టన్(36)తో కలిసి ఈ లేడీ సెహ్వాగ్ రెచ్చిపోయింది. ఆమె ఔటయ్యాక హామిల్టన్ సిక్సర్లతో స్కోర్ 160 దాటించింది.