INDW vs PAKW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లోనే ఓటమి. రెండో మ్యాచ్‌లో గెలిస్తే తప్ప సెమీస్ చేరే అవకాశం లేదు. ఏరకంగా చూసినా టీమిండియాకు చావోరేవో మ్యాచ్. అలాంటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన భారత అమ్మాయిలు.. అతికష్టమ్మీద గట్టెక్కారు. ఓపెనర్ షఫాలీ వర్మ(35), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(29)ల అద్భుత పోరాటంతో ఆదుకున్నారు. మిడిల్ ఓవర్లలో జెమీమా రోడ్రింగ్స్(23) కీలక ఇన్నింగ్స్ ఆడింది. విజయానికి రెండు పరుగులు అవసరం అనగా హర్మన్‌ప్రీత్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరినా.. సజన(4) లాంఛనం పూర్తి చేసింది. ఉత్కంఠ పోరులో 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించిన టీమిండియా సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.
తొలి టీ20 ప్రపంచ కప్ వేటలో భారత మహిళల జట్టు తొలి విజయం నమోదు చేసింది. న్యూజిలాండ్‌పై భారీ ఓటమి నుంచి తేరుకున్న టీమిండియా దాయాది పాకిస్థాన్‌పై అద్భుతంగా ఆడి బోణీ కొట్టింది. స్వల్ప ఛేదనలో టీమిండియా ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. తొలి మ్యాచ్‌లో మాదిరిగానే ఈసారి కూడా భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ స్మృతి మంధానా(7)ను వెనక్కి పంపింది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన జెమీమా రోడ్రిగ్స్(23) చకచకా డబుల్స్ తీసి స్కోర్ బోర్డును నడిపించింది. కాస్త కుదురుకున్నాక షఫాలీ వర్మ (35) భారీ షాట్లు ఆడలేకపోయింది. పాక్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో 10 ఓవర్లలో భారత్ 50 రన్స్ చేసిందంతే..
#TeamIndia are back to winning ways!
A 6-wicket win against Pakistan in Dubai 👏👏
📸: ICC
Scorecard ▶️ https://t.co/eqdkvWWhTP#T20WorldCup | #INDvPAK | #WomenInBlue pic.twitter.com/0ff8DOJkPM
— BCCI Women (@BCCIWomen) October 6, 2024
డ్రింక్స్ బ్రేక్ తర్వాత షఫాలీ గేర్ మార్చింది. బౌండరీలతో చెలరేగే క్రమంలో భారీ షాట్ ఆడిన ఆమె బౌండరీ వద్ద అలియా రియాజ్‌కు చిక్కింది. దాంతో రెండో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(29) అండగా రోడ్రిగ్స్..ధనాధన్ ఆడాలని చూసింది. కానీ, 16వ ఓవర్లోపాక్ సారథి సనా ఫాతిమా వరుస బంతుల్లో జెమీమా, రీచా ఘోష్(0)లను ఔట్ చేసి ఒత్తిడి పెంచింది. అప్పటికీ భారత జట్టు విజయానికి 26 బంతుల్లో 25 పరుగులు అవసరం.
18 ఓవర్తొలి బంతికే అంపైర్ దీప్తిని ఎల్బీగా ఔట్ ఇచ్చింది. అంతే.. భారత డగౌట్‌లోని అందరిలో టెన్షన్.. కానీ, రివ్యూ తీసుకోవడంతో దీప్తి బతికిపోయింది. నాలుగో బంతికి బౌండరీ కొట్టిన హర్మన్‌ప్రీత్ పాక్ ఆశలపై నీళ్లు చల్లింది. ఆ బౌండరీతో భారత విజయాన్ని తేలిక చేసిన ఆమె క్రీజులో పడిపోయి మెడనొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఆ వెంటనే క్రీజులకోఇ వచ్చిన సంజన(4 నాటౌట్) బౌండరీతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. దాంతో.. మెగా టోర్నీలో పాకిస్థాన్‌పై తన ఆధిపత్యాన్ని చాటుకున్న టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాక్‌కు మొదటి ఓవర్లోనే రేణుకా సింగ్ షాక్ ఇచ్చింది. ఓపెనర్ గుల్ ఫిరోజ్ (0)ను బౌల్డ్ చేసి ప్రత్యర్థిని వణికించింది. ఆ తర్వాత అరుంధతీ రెడ్డి(3/19), దీప్తి శర్మ కూడా వికెట్ల వేట కొనసాగించడంతో పవర్ ప్లేలోనే 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మునీబా(17) ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. కానీ.. శ్రేయాంక పాటిల్(2/12) తన మొదటి ఓవర్లోనే డేంజరస్ మునీబాను బోల్తా కొట్టించి పాక్‌ను మరింత కష్టాల్లోకి నెట్టింది. ఆ తర్వాత మాజీ కెప్టెన్ నిదా దార్ (28) ఆచితూచి ఆడుతూ అలియా రియాజ్(4), ఒమైమ్ సొహైల్(3)లతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దింది. భారత పేలవ ఫీల్డింగ్ కూడా వాళ్లకు కలిసొచ్చింది.
For her economical match-winning three-wicket haul, Arundhati Reddy receives the Player of the Match award 👏👏
Scorecard ▶️ https://t.co/eqdkvWWhTP#TeamIndia | #T20WorldCup | #INDvPAK | #WomenInBlue pic.twitter.com/CxjjjAf0yG
— BCCI Women (@BCCIWomen) October 6, 2024
రియాజ్ ఔటయ్యాక వచ్చిన కెప్టెన్ ఫాతిమా సనా(13) ఉన్నంతసేపు ధనాదన్ ఆడింది. శోభన వేసిన ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో స్కోర్ 70 దాటింది. అయితే.. ఐదో బంతికి వికెట్ కీపర్ రీచా స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో ఆమె వెనుదిరిగింది. 71 వద్ద ఏడో వికెట్ పడగా.. ధార్, అరూబ్ షా(14 నాటౌట్)లు ధాటిగా ఆడారు. ఆఖరి ఓవర్లో దార్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన నష్ర సంధు ఓ బౌండరీతో జట్టు స్కోర్ 100 దాటించింది. దాంతో, టీమిండియాకు పాక్ 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.