Bathukamma | అమెరికాలో గుబాళించిన బతుకమ్మ.. పలు రాష్ట్రాల్లో అధికారిక గుర్తింపు.. !
Bathukamma | తెలంగాణ సాంసృతిక వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. తాజాగా అమెరికాలోని పలు రాష్ట్రాలు బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపునిచ్చాయి.
Bathukamma | హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాంసృతిక వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. తాజాగా అమెరికాలోని పలు రాష్ట్రాలు బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపునిచ్చాయి. ఇప్పటికే పలు దేశాల్లో తెలంగాణ ఆడపడుచులు అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆడుతున్న విషయం విధితమే. ప్రస్తుతం ప్రతిష్టాత్మక వైట్ హౌజ్, ఆస్ట్రేలియా ఒపేరా హౌజ్, లండన్ బ్రిడ్జ్, ఐపిల్ టవర్ తదితర చోట్ల వేడుకగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారురు.
తాజాగా అమెరికా రాష్ర్టాలైన నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్, వర్జీనియా రాష్ర్టాలు బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఈ వారాన్ని బతుకమ్మ పండగ, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించారు. బతుకమ్మ వైభవాన్ని, ప్రజలను కలుపుతూ వారి మద్య పెంపొందిస్తున్న సుహృద్భావ వాతావరణాన్ని వారు కొనియాడారు.
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, పలు ఇతర సంఘాలు, ప్రవాస తెలంగాణీయులు గత కొంత కాలంగా తెలంగాణ బతుకమ్మకు ఖండాంతరాల్లో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. తాజా గుర్తింపుతో వారి కృషికి ఫలితం దక్కినైట్లెంది. గతంలో సైతం కొన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలు బతుకమ్మకు అధికారిక గుర్తింపునిచ్చాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
IND vs NZ | బుమ్రా దెబ్బకు లాథమ్ ఔట్.. టీ బ్రేక్‌కు కివీస్ స్కోర్ ఇదే
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

