న్యూఢిల్లీ: జాతీయ రెజ్లింగ్ సంఘం (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో నిరసనకు దిగిన రెజ్లర్లను జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష బుధవారం కలుసుకుంది. జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తున్న వినేశ్ ఫోగట్, సాక్షిమాలిక్, సంగీతా ఫోగట్, బజరంగ్ పునియాను కలిసి వారి సమస్యలపై ఉష చర్చించింది.
సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని తమకు హామీ ఇచ్చినట్లు రెజ్లర్లు పేర్కొన్నారు. ముఖ్యంగా బ్రిజ్‌భూషణ్‌పై తగు చర్యలు తీసుకునే వరకు నిరసన కొనసాగిస్తామని ఉషకు తాము స్పష్టం చేశామని రెజ్లర్లు తెలిపారు.