హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో అనిశ్చితి పర్వం కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షునిగా కొనసాగుతున్న దల్జీత్‌సింగ్ పై బీసీసీకి పలువురు క్లబ్ సెక్రటరీలు ఫిర్యాదు చేశారు. ఈనెల 28న ముంబైలో బీసీసీఐ 95వ ఏజీమ్ జరుగనుంది.
ఇందుకోసం బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు ఆహ్వానం అందింది. దల్జీత్‌సింగ్ కొనసాగడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమంటూ పలువురు కార్యదర్శులు బోర్డు లేఖ రాశారు.