న్యూఢిల్లీ: యూత్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఏడుగురు భారత బాక్సర్లు ఫైనల్లో అడుగుపెట్టారు. స్పెయిన్ వేదికగా జరుగుతున్న టోర్నీ పురుషుల విభాగంలో వన్షజ్, విశ్వనాథ్ సురేశ్, ఆశీష్ తుదిపోరుకు అర్హత సాధించగా.. మహిళల విభాగం నుంచి కీర్తి (+81 కేజీలు), భావన (48 కేజీలు), దేవిక (52 కేజీలు), రవీన (63 కేజీలు) కూడా ఫైనల్కు చేరారు.