క్రిస్ట్‌చర్చ్ : తొలి టెస్టులో న్యూజిలాండ్ నిర్దేశించిన 531 పరుగుల భారీ ఛేదనలో వెస్టిండీస్ పోరాడుతున్నది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 212 రన్స్ చేసింది.
టాపార్డర్ విఫలమైనా షై హోప్ (116 నాటౌట్), జస్టిన్ గ్రీవ్స్ (55*) అజేయమైన ఐదో వికెట్‌కు 140 పరుగులు జోడించి ఆ జట్టును ఆదుకున్నారు. ఐదో రోజు ఆ జట్టు 319 పరుగులు ఛేయాల్సి ఉన్న నేపథ్యంలో కరీబియన్లు పోరాడుతారా? లేక మరో ఓటమిని మూటగట్టుకుంటారా? అన్నది ఆసక్తికరం.