Mohammad Shami | షమీకి కమ్‌బ్యాక్ కష్టాలు.. దేశవాళీ క్రికెట్‌పైనే గంపెడు ఆశలు..!
Mohammad Shami : ఒకప్పుడు ప్రధాన పేసర్‌గా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన మహ్మద్ షమీ (Mohammad Shami) ఇప్పుడు చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్లో ఇంగ్లండ్ పర్యటనకు దూరమైన ఈ పేసర్ ఫామ్ చాటుకునేందుకు సిద్దమవుతున్నాడు.
Mohammad Shami : ఒకప్పుడు ప్రధాన పేసర్‌గా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన మహ్మద్ షమీ (Mohammad Shami) ఇప్పుడు చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. మునపటి పేస్ పవర్ తగ్గడంతో అతడిని తీసుకునేందుకు సెలెక్టర్లు ఆసక్తి చూపించడం లేదు. ఐపీఎల్ 18వ సీజన్లో ఇంగ్లండ్ పర్యటన (England Tour)కు దూరమైన ఈ పేసర్ ఫామ్ చాటుకునేందుకు సిద్దమవుతున్నాడు. దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శనతో పునరాగమనం చేయాలని అనుకుంటున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న దేశవాళీ సీజన్లో ఈ స్పీడ్‌స్టర్ బెంగాల్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
శనివారం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ 50 మంది ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. ఇందులో షమీతో పాటు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పేసర్ ఆకాశ్ దీ(Akash Deep), బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌లు కూడా ఉన్నారు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున అదరగొడుతున్న కుర్రాడు అభిషేక్ పొరెల్ సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
After missing spot in India’s squad for England tour, Mohammed Shami set to make cricketing comeback: Check details#MohammedShami https://t.co/VbinZguhmk
— Sports Tak (@sports_tak) July 19, 2025
9 మ్యాచుల్లో ఆరు వికెట్లు
కమ్‌బ్యాక్ చేయడం ఏ క్రికెటర్‌కైనా కష్టమే. ఇప్పుడు షమీ అలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 అనంతరం గాయం కారణంగా జట్టుకు దూరమైన షమీ.. ఏడాది తర్వాత ఎంట్రీ ఇచ్చాడు. దేశవాళీలో రెండు మ్యాచుల్లో సత్తా చాటిన అతడు ఐపీఎల్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ (Sunrisers Hyderabad)కు ప్రాతినిధ్యం వహించాడు.
కానీ, ఈ పేస్ గన్ ఈ మెగా టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేదు. ఆరెంజ్ ఆర్మీని తీవ్రంగా నిరాశపరుస్తూ 9 మ్యాచుల్లో కేవలం ఆరు వికెట్లు తీశాడంతే. మునపటిలా రాణించలేకపోవడంతో ఇంగ్లండ్ టూర్‌కు అతడిని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. సో.. ఇక ఉన్నదారి దేశవాళీలో వికెట్ల వేటతో అందరి దృష్టిని ఆకర్షించడమే. డొమెస్టిక్ సీజన్ 2025-26 ఆగస్టులో మొదలవ్వనుంది.

బెంగాల్ ప్రాబబుల్స్ : అభిమన్యు ఈశ్వరన్, షమీ, అనుస్తుప్ మజుందార్ సుదీప్ ముఖర్జీ, సుదీప్ కుమార్, అభిషేక్ పొరెల్(వికెట్ కీపర్), షకిర్ హబిబ్ గాంధీ (వికెట్ కీపర్), కజీ జునైద్ సైఫీ, షహబాజ్ అహ్మద్, ప్రదీప్త ప్రమాణిక్, వ్రిత్తిక్ ఛటర్జీ, కరన్ లాల్, ఆకాశ్ దీప్ ముకేశ్ కుమార్ సింధు జైస్వాల్, ఇషాన్ పొరెల్, మహ్మద్ కైఫ్ శుభమ్ ఛటర్జీ, సుమంత గుప్త.. తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
- Hari Hara Veera Mallu | ‘హరి హర వీరమల్లు’ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- Husband murder | ‘ఇంకా చావడంలేదు ఏం చేయాలి’.. భర్తను చంపుతూ ప్రియుడితో భార్య చాటింగ్
- TGSRTC | టీజీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ అవకాశాలు..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

