హైదరాబాద్, ఆట ప్రతినిధి: డివిజన్ వన్డే లీగ్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ సెంచరీతో కదంతొక్కారు. సికింద్రాబాద్ క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీవీ ఆనంద్ యూత్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో 95 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేశారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన సికింద్రాబాద్ క్లబ్ నిర్ణీత 35 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్యఛేదనలో యూత్ ఎలెవన్ జట్టు 35 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా క్లబ్ టీమ్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లోనూ రాణించిన ఆనంద్ ఒక వికెట్ పడగొట్టారు.