Sanju Samson : స్వదేశంలో ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను గెలిపించిన సంజూ శాంసన్ (Sanju Samson) అనూహ్యంగా ఇప్పుడు స్క్వాడ్‌లో లేడు. మూడు మ్యాచుల్లో విఫలమయ్యాడని అతడిని జింబాబ్వే పర్యటనకు తప్పించారు. అయితే.. యువసంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) కోసమే శాంసన్‌ను పక్కనపెట్టేశారనే ప్రచారం జరుగుతోంది. కానీ, ఆసియా క్రీడల స్క్వాడ్‌లో భాగమైన సంజూను జింబాబ్వే సిరీస్‌కు తీసుకోకపోవడానికి కారణం వైభవ్ కాదని, ఐపీఎల్లో దంచేస్తున్నచిచ్చరపిడుగు (Prabhsimran Singh) అని సెలెక్టర్లు చెప్పినట్టు క్రిక్ఇన్ఫో కథనం పేర్కొంది.
ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్, ఇంగ్లండ్ చేతిలో పరాజయంతో భారత సెలెక్టర్లు టీ20 స్క్వాడ్‌లో భారీ మార్పులు చేశారు. జింబాబ్వే పర్యటనకు పలువురిని పక్కనపెట్టి.. ఐపీఎల్లో, దేశవాళీ క్రికెట్లో రాణించిన వాళ్లను ఎంపిక చేశారు. ఓపెనర్‌గా విఫలమవుతున్న సంజూ శాంసన్‌పై వేటు వేశారు. దాంతో, వైభవ్ సూర్యవంశీ కోసమే సంజూను తప్పించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. అందరూ అనుకుంటున్నట్టు వైభవ్ కోసం సంజూను పక్కనపెట్టలేదని.. టీ20ల్లో చితక్కొడుతున్న ప్రభ్‌సిమ్రన్ సింగ్(Prabhsimran Singh)కు అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెలెక్టర్లు చెప్పారని క్రిక్ఇన్ఫో కథనం వెల్లడించింది.
Why was Sanju Samson omitted from India’s squad for the three-match series vs Zimbabwe?
We have learned that the Ajit Agarkar-led selection panel did not consider Sanju Samson only because the Zimbabwe tour is a fringe series. And with Samson already part of the India squad for… pic.twitter.com/tPLRQFLn5A
— Cricinfo (@cricinfo) July 7, 2026
‘సొంతగడ్డపై జరిగిన పొట్టి వరల్డ్‌కప్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడిన సంజూ శాంసన్ టీ20 స్క్వాడ్‌లో భాగమే. సెప్టెంబర్‌లో జపాన్ వేదికగా మొదలయ్యే ఆసియా క్రీడల స్క్వాడ్‌లోనూ శాంసన్ ఉన్నాడు. అయితే.. జింబాబ్వే పర్యటనకు పెద్దగా ప్రాధాన్యం లేనందునే అతడిని ఎంపిక చేయలేదు. చిన్న సిరీస్‌కు ఇద్దరు సీనియర్ వికెట్ల కీపర్లు ఇషాన్ కిషన్, సంజూలను ఎంపిక చేయడం సరైంది కాదనిపించింది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున గత రెండు సీజన్లలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అందుకని వికెట్ కీపర్, బ్యాటరైన అతడికి అవకాశం ఇవ్వాలనుకున్నాం’ అని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్ల బృందం పేర్కొన్నట్టు క్రిక్ఇన్ఫో తెలిపింది. జింబాబ్వే సిరీస్ కోసం సోమవారం శ్రేయాస్ అయ్యర్ సారథిగా 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.
After consecutive 500+ seasons for PBKS, Prabhsimran Singh has earned a callup to India’s squad for the Zimbabwe tour 👏#ZIMvIND pic.twitter.com/cKjKSssaMW
— Cricbuzz (@cricbuzz) July 6, 2026
జింబాబ్వేతో టీ20 సిరీస్ కోసం భారత సెలెక్టర్లు స్క్వాడ్‌లో కీలక మార్పులు చేశారు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన వారిలో సగం మందిని తప్పించి కొత్త వాళ్లకు ప్రాధాన్యమిచ్చారు. ఐర్లాండ్‌పై తేలిపోయిన ఓపెనర్ సంజూ శాంనన్పై వేటు పడగా.. ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం దక్కింది. అలానే వికెట్ కీపర్‌గా ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఎంపికవ్వగా.. మిడిలార్డర్ బ్యాటర్‌గా సూర్యాన్ష్ షెడ్గే, ఫినిషర్‌గా రింకూ సింగ్‌ను తీసుకున్నారు.

ఐపీఎల్ 19వ సీజన్లో మెరిసిన ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, హర్ష్ దూబే, మయాంక్ యాదవ్‌లో బౌలింగ్ దళంలో చోటు దక్కించుకున్నారు. భారత్, జింబాబ్వే మధ్య జూలై 23 నుంచి హరారేలో టీ20 సిరీస్ మొదలవ్వనుంది. ఈ సిరీస్‌తో ప్రభ్‌సిమ్రన్ అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేయనున్నాడు.
🚨 News 🚨#TeamIndia squad announced for the 3️⃣-match T20I series against Zimbabwe.
More Details ▶️ https://t.co/sC19D5eW8y#ZIMvIND pic.twitter.com/ctbM5gFMtY
— BCCI (@BCCI) July 6, 2026
భారత స్క్వాడ్ : శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.