సిడ్నీ: సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు బ్రేక్ ఇచ్చాడు బోలాండ్(Scott Boland). ఆ స్పీడ్ బౌలర్ ఇద్దరు ఇండియన్ ఓపెనర్లను ఔట్ చేశాడు. తొలుత కేఎల్ రాహుల్, ఆ తర్వాత జైస్వాల్ అతని బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఇండియా 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 48 రన్స్ చేసింది. ప్రస్తుతం భారత్ 52 రన్స్ ఆధిక్యంలో ఉన్నది. జైస్వాల్ 22, రాహుల్ 13 రన్స్ చేసి ఔటయ్యారు.
నిజానికి ఫస్ట్ ఓవర్లో అటాకింగ్ ఆడిన జైస్వాల్ ఆ తర్వాత తన జోరును అందుకోలేకపోయాడు. స్టార్క్ వేసిన తొలి ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టిన అతను మళ్లీ వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. బోలాండ్ మూడు ఓవర్లలో రెండు వికెట్లు తీసి 11 రన్స్ సమర్పించుకున్నాడు.
Scott Boland with a peach to get KL Rahul! #AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/Cu1qhVVvWQ
— cricket.com.au (@cricketcomau) January 4, 2025