కరాచీ: దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. నాలుగు జట్లు బాక్సింగ్ డే టెస్టుకు సిద్ధమయ్యాయి. పాకిస్థాన్ తమ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో తలపడనుండగా.. మెల్బోర్న్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనుంది.
ఇటీవల ఇంగ్లండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాకిస్థాన్.. కివీస్‌పై నెగ్గాలని చూస్తుంటే, తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన ఆసీస్.. అదే జోరులో సిరీస్ పట్టేయాలని భావిస్తున్నది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లు సుదీర్ఘ ఫార్మాట్ అభిమానులను అలరించనున్నాయి.