Saud Shakeel | గాలె: పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ (361 బంతుల్లో 208 నాటౌట్; 19 ఫోర్లు) నయా చరిత్ర లిఖించాడు. శ్రీలంకలో డబుల్ సెంచరీ చేసిన తొలి పాక్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. లంకతో జరుగుతున్న తొలి టెస్టులో షకీల్ అజేయ డబుల్ సెంచరీతో రాణించడంతో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 461 పరుగులు చేసింది. సల్మాన్ (83) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
నసీమ్ షా (78 బంతుల్లో 6)తో కలిసి షకీల్ 9వ వికెట్కు 94 పరుగులు జోడించడం విశేషం. లంక బౌలర్లలో రమేశ్ 5, ప్రభాత్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక మంగళవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న లంక.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 135 పరుగులు వెనుకబడి ఉంది.