హాంగ్జౌ(చైనా): ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో భారత స్టార్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి పోరాటం ముగిసింది. మెగాటోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి భారత జోడీగా కొత్త చరిత్ర లిఖించిన సాత్విక్, చిరాగ్ అదే పోరాటాన్ని కొనసాగించలేకపోయారు.
శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్‌లో సాత్విక్, చిరాగ్ ద్వయం 21-10, 17-21, 13-21తో చైనా జంట లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్ చేతిలో ఓటమిపాలైంది. గంట పాటు హోరాహోరీగా సాగిన పోరులో ఈ యువ షట్లర్లు పోరాడి ఓడారు. తొలి గేమ్‌ను 21-10తో దక్కించుకుని ఆధిక్యం కనబరిచిన సాత్విక్, చిరాగ్ అదే దూకుడు కొనసాగించలేకపోయారు. ఫలితంగా మెగాటోర్నీలో ఫైనల్ చేరుకునే అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది.