ఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టారు. మూడు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి ఎగబాకారు. నిరుడు సెప్టెంబర్ తర్వాత టాప్-5లో చోటు దక్కించుకోవడం సాత్విక్ ద్వయానికి ఇదే తొలిసారి.
ఈ ఏడాది ఇంకా ఒక్క బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ నెగ్గకపోయినప్పటికీ ఈ జోడీ నిలకడగా ఆడుతున్నది. ఈ సీజన్లో ఆరు సెమీస్‌లు, రెండుసార్లు ఫైనల్ చేరిన భారత ద్వయం.. 2025 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కిమ్ వొన్ హొ-సియొ సెవాంగ్ ఝె (దక్షిణ కొరియా) అగ్రస్థానంలో ఉండగా మలేషియా ఆటగాళ్లు ఆరోన్ చియా-సో వుయి యిక్ రెండో స్థానంలో నిలిచారు.