న్యూఢిల్లీ: బ్యాడ్మింట్ వరల్డ్ చాంపియన్‌షిప్ లో భారత జోడికి పతకం ఖాయమైంది. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి (Satwik-Chirag) జోడి 21-12, 21-19 స్కోరుతో విజయం సాధించారు. మలేషియాకు చెందిన ఒలింపిక్ మెడలిస్టు జోడి ఆరన్ చియా, సోహ్ వూయి యిక్‌లపై గెలుపొందారు. సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇండియన్ జోడికి దాదాపు పతకం ఖాయమైనట్లే. పారిస్ ఒలింపిక్స్‌లో మలేషియా జోడి చేతిలో ఓడిన ఇండియన్ షట్లర్లు ఇవాళ ప్రతీకారం తీర్చుకున్నారు. కేవలం 43 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించారు.
మ్యాచ్ గెలవడం అద్భుతంగా ఉన్నట్లు చిరాగ్ తెలిపాడు. మలేషియా ప్రత్యర్థులతో ఆడడం ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు. చాలా సార్లు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చిందని, అయితే ఇవాళ గెలవడం నిజంగా సంతోషంగా ఉన్నట్లు చిరాగ్ చెప్పాడు. 2022 ఈవెంట్లో సాత్విక్-చిరాగ్ జోడి బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మరో పతకాన్ని గెలుచుకోనున్నారు.
ఏషియన్ గేమ్స్ చాంపియన్స్‌గా నిలిచిన భారత జోడి మెన్స్ డబుల్స్ సెమీఫైనల్లో 11వ సీట్ ప్లేయర్లు చెన్ బో యాంగ్, లియు యితో తలపడనున్నారు. సెమీస్‌లో ఆడుతున్నప్పుడు అండర్డాగ్స్ ఎవరూ ఉండరని చిరాగ్ అన్నాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు క్వార్టర్స్‌లో ఓడిన విషయం తెలిసిందే.