షెన్జెన్ (చైనా): భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్-చిరాగ్ చైనా మాస్టర్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత తొలి టోర్నీ ఆడుతున్న ఈ మాజీ ప్రపంచ నంబర్‌వన్ జోడీ.. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో 21-16, 21-19తో కిమ్ అస్ర్తుప్-ఆండర్స్ స్కరుప్ (డెన్మార్క్)ను చిత్తుచేసింది.
47 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో సాత్విక్-చిరాగ్ ఆది నుంచీ ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 18-21, 15-21తో అండర్స్ అంటోన్సెన్(డెన్మార్క్) చేతిలో ఓటమిపాలయ్యాడు. లక్ష్యసేన్ నిష్క్రమణతో సింగిల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది.