హాంగ్జౌ (చైనా): బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు.
గ్రూప్-డీలో భాగంగా జరిగిన పురుషుల డబుల్స్ తొలి మ్యాచ్‌లో భారత జోడీ.. 12-21, 22-20, 21-14తో ప్రపంచ ఐదో ర్యాంకర్లు చాంగ్ వాంగ్-వీ కెంగ్ లియాంగ్ (చైనా)ను ఓడించింది. సాత్వి క్ జోడీ తొలి గేమ్‌ను ఓడినా తర్వాత పుంజుకుని వరుసగా రెండు గేమ్స్‌ను గెలుచుకుని ప్రత్యర్థిని చిత్తుచేసింది.