షెన్జెన్(చైనా): చైనా మాస్టర్స్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ 18-21, 21-14, 16-21తో అన్‌సీడెడ్ కొరియా జంట జిన్ యంగ్, సియో సంగ్జీ చేతిలో ఓటమిపాలైంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత తొలిసారి బరిలోకి దిగిన టోర్నీలో మాజీ ప్రపంచ నంబర్‌వన్ జోడీ ఆకట్టుకోలేకపోయింది. తొలి గేమ్‌ను చేజార్చుకున్న సాత్విక్, చిరాగ్ పుంజుకుని రెండో గేమ్‌ను దక్కించుకున్నారు. మూడో గేమ్‌లో పోటీనివ్వలేకపోయారు.