హైదరాబాద్, ఆట ప్రతినిధి: మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 29న జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా చలో మైదాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సాట్స్ సిద్ధమైంది. యువతను భాగస్వాములుగా చేస్తూ 33 జిల్లా కేంద్రాల్లో పండుగ వాతావరణంలో చలో మైదాన్ జరుగనుంది.
ఇందుకు సంబంధించి గురువారం డీవైఎస్వోలతో సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ క్రీడాకారులకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని, ప్రభుత్వ క్రీడాభివృద్ధి కార్యక్రమాలపై యువతకు అవగాహన కల్పించాలి. క్రీడలతోనే ఆరోగ్యం, అభివృద్ధి సాధ్యమనే వాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేయాలి’ అని అన్నారు. సమీక్షలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరెక్టర్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.