World Athletics Championships : భారత హై జంపర్ సర్వేశ్ కుశారే (Sarvesh Kushare) చరిత్రకు కొద్ది దూరంలో ఆగిపోయాడు. జపాన్‌లోని టోక్యో వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఫైనల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. క్వాలిఫయింగ్‌లో మెరిసి అతడు.. అంతిమ పోరులో 2.28 మీటర్ల ఎత్తు దూకి ఆరో స్జానంతో సరిపెట్టుకున్నాడు. అయినప్పటికీ తన కెరీర్లలోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మెగా టోర్నీ చరిత్రలో టాప్ -6లో నిలిచిన నాలుగో భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు సర్వేశ్.
ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో సర్వేశ్ సంచలన ప్రదర్వనతో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 2.16 మీటర్ల ఎత్తు దూకడంలో తొలి ప్రయత్నంలో విఫలం అయినప్పటికీ.. ఒత్తిడికి లోనవ్వలేదు సర్వేశ్. రెండో ప్రయత్నంలో 2.2 5 మీటర్ల ఎత్తు దుమికి ఫైనల్ బెర్తు సాధించాడు.
A historic campaign for Sarvesh! 🫡
First Indian athlete to enter the high jump final, Sarvesh Kushare, ends his World Athletics Championships 2025 campaign with a 6th-place finish and a personal best jump of 2.28m in Tokyo. 🙌 pic.twitter.com/02Dntbix3H
— Olympic Khel (@OlympicKhel) September 16, 2025
తద్వారా భారత్ నుంచి ఈ విభాగంలో ఫైనల్ చేరిన తొలి పురుష అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు సర్వేశ్. టోక్యో ఒలింపిక్స్ విజేత గియన్మార్కో తంబేరి (Gianmarco Tamberi)ని వెనక్కి నెట్టిసి పతకంపై ఆశలు రేపాడు. గతంలో అతడి బెస్ట్ జంప్ 2.27గా ఉండేది. ఫైనల్లో అతడు తన రికార్డును అధిగమిస్తూ 2.28 మీటర్ల ఎత్తు దూకాడు.
Wooooooooooahhhhhhhhhhhhhh! 🔥🔥🔥
Sarvesh Kushare broke Personal Best 2.28M 💪pic.twitter.com/vsTTyLC2c2
— The Khel India (@TheKhelIndia) September 16, 2025