హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత టెస్టు జట్టులో రీఎంట్రీ కోసం వేచి చూస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీల్లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. హైదరాబాద్‌తో ఉప్పల్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో సర్ఫరాజ్ (219 బంతుల్లో 227, 19 ఫోర్లు, 9 సిక్స్‌లు) ద్విశతకం బాదాడు.
అతడికి తోడు సిద్ధేశ్ (104), సువెద్ పార్కర్ (75) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 560 పరుగుల భారీ స్కోరు చేసి మ్యాచ్‌పై పట్టు బిగించింది. అనంతరం బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 138/2 చేసింది. రాహుల్ సింగ్ (82*) శతకం దిశగా సాగుతుండగా హిమతేజ (40*) అతడికి అండగా నిలిచాడు.
భారత టెస్టు, వన్డే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పంజాబ్ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. రాజ్‌కోట్‌లో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌ను ఆ జట్టు రెండ్రోజుల్లోనే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర నిర్దేశించిన 319 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమం లో పంజాబ్ 125 రన్స్‌కే చేతులెత్తేసింది.