హైదరాబాద్, ఆట ప్రతినిధి : ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీలో పశ్చిమ బెంగాల్ జట్టు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. బుధవారం హైదరాబాద్‌లోని డెక్కన్ ఏరీనా వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగాల్.. 3-1తో ఒడిషాను ఓడించింది. ఈ టోర్నీలో బెంగాల్ సెమీస్‌కు చేరడం ఇది 52వ సారి కావడం విశేషం. ఒడిషా తరఫున రాకేశ్ ఓరమ్ 25వ నిమిషంలో తొలి గోల్ చేసి ఆ జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చినా ఆ తర్వాత బెంగాల్ పుంజుకుంది. రాబొ హన్స్డ రెండు గోల్స్ చేయగా సబ్‌స్టిట్యూట్ మనొటొస్ మాఝి ఒక గోల్ చేశాడు.