KKR vs RR: ఐపీఎల్ 17వ సీజన్లో కీలక మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. టేబుల్ టాపర్స్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్లు ఈడెన్ గార్డెన్లో అమీతుమీకి సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సంజూ సేన ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. సమఉజ్జీల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో మరికాసేపట్లో తేలనుంది.
కోల్‌కతా తుది జట్టు : ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), వెంటకేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మైర్, రొవ్మన్ పావెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్, చాహల్.