Sanju Samson : ఐపీఎల్లో సిక్సర్లతో అలరించే సంజూ శాంసన్ (Sanju Samson) ఫ్రాంచైజీ మారేందుకు సిద్ధమయ్యాడు. ఊహించినట్టుగానే రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)ను వీడి పంతొమ్మిదో సీజన్లో కొత్త జట్టుకు ఆడాలని నిర్ణయించుకున్నాడు సంజూ. తనను అట్టిపెట్టుకోవద్దని యాజమాన్యానికి తెలియజేశాడు కూడా. అయితే.. రాజస్థాన్ ఓనర్స్ ఏం డిసైడ్ అవుతారో చూడాలి.
పద్దెనిమిదో సీజన్ కోసం శాంసన్‌ను రూ.18 కోట్లకు రీటైన్ చేసుకుంది ఫ్రాంచైజీ. కానీ, అతడు గాయంతో కీలక మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కెప్టెన్‌గా రియాన్ పరాగ్ ఆకట్టుకోవడంతో పాటు వికెట్ కీపర్, బ్యాటర్‌గా ధ్రువ్ జురెల్ రాణించడంతో సంజూను కొనసాగించడం అసాధ్యమనిపిస్తోంది.
Rajasthan Royals captain Sanju Samson has told the franchise he wants to be released ahead of the upcoming auction for IPL 2026
Read more 🔗 https://t.co/p4vHfzlEia pic.twitter.com/pQfw4moqQF
— ESPNcricinfo (@ESPNcricinfo) August 7, 2025
సారథిగా రాజస్థాన్ జట్టుకు ట్రోఫీ అందించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు సంజూ. కానీ, అతడి కల నిజం కాలేదు. దాంతో… జెర్సీ మారిస్తేనే లక్ మారుతుందని భావిస్తున్నాడీ సిక్సర్ల కింగ్. వచ్చే సీజన్లో సంజూ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు బలం చేకూర్చేలా.. ఈమధ్య అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో సీఎస్కేకు మద్దుతుగా పోస్ట్‌లు పెట్టాడు. ‘సంజూ రిలీజ్డ్.. సీఎస్కే రెడీ’ అంటూ ధోనీ, శాంసన్ నవ్వుతూ ఉన్న పోస్ట్‌లు వైరలయ్యాయి. ఆ పోస్ట్‌లు చూసినవాళ్లంతా శాంసన్.. సీఎస్కే ఫ్రాంచైజీకి ఆడడం ఖాయం అని మస్త్ ఖుషీ అయ్యారు.
శాంసన్ 2021లో రాజస్థాన్ రాయల్స్ సారథిగా ఎంపికయ్యాడు. తన పవర్ హిట్టింగ్తో, అద్భుతమైన నాయకత్వ పటిమతో జట్టును మరుసటి ఏడాదే ఫైనల్ చేర్చాడు. కానీ, టైటిల్ పోరులో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ కప్ ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత సీజన్లలో మాత్రం ప్లే ఆఫ్స్‌కు ముందే ఆ జట్టు కథ ముగిసింది. 18వ సీజన్లోనూ అంతే. సీజన్ ఆరంభంలో గాయం కారణంగా కీలక మ్యాచ్‌లకు దూరమైన శాంసన్.. ఆఖర్లో జట్టులోకి వచ్చాడు.. కానీ, అప్పటికే రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు అడుగంటాయి.