Sanju Samson : వన్డే సిరీస్ పట్టేసిన భారత జట్టు పొట్టి ఫార్మాట్లోనూ దక్షిణాఫ్రికాకు చెక్ పెట్టాలనుకుంటోంది. టీ20ల్లో తిరుగులేని విజయాలు సాధిస్తూ.. రికార్డు స్థాయిలో ఆరు సిరీస్‌లు గెలుపొందిన టీమిండియా జోరు చూపాలనే కసితో ఉంది. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు ఆడడం ఖాయమైన వేళ.. తుదిజట్టు ఎంపిక ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా సంజూ శాంసన్(Sanju Samson)ను తీసుకుంటారా? లేదా? తెలియడం లేదు. వికెట్ కీపర్‌గా సంజూకు, జితేశ్ శర్మ (Jitesh Sharma) మధ్య పోటీ నెలకొనడమే అందుకు కారణం.
టీ20ల్లో వరుసపెట్టి ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్న భారత్ ఈసారి స్వదేశంలో దక్షిణాఫ్రికా సవాల్‌కు సిద్ధమైంది. ఆసియా కప్ విజేతగా ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్ గెలుపొందిన టీమిండియా.. అదే కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశముంది. శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులో చేరడంతో.. శాంసన్ ఓపెనింగ్ చేసే అవకాశం లేదు. వికెట్ కీపర్, విధ్వంసక ఆటగాడైన సంజూను టాపార్డర్‌లో ఆడిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. కోచ్‌గా గౌతం గంభీర్ మొదటి ఛాయిస్ శాంసనే అయినా జితేశ్ శర్మ నుంచి గట్టి పోటీనెలకొంది.
Sanju Samson and Tilak Varma against South Africa. 🔥 pic.twitter.com/ODJl0lmvej
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 8, 2025
ఆసీస్ గడ్డపై, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో మెరిసిన.. జితేశ్‌కు మరో అవకాశం ఇస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పవర్ హిట్టింగ్ పరంగా జితేశ్ కంటే మెరుగైన శాంసన్‌కు టీ20ల్లో అనుభవం ఎక్కువ. మరి.. ఈ ఇద్దరిలో కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎవరిని ఎంచుకుంటారో మంగళవారం టాస్ పడ్డాకే తెలియనుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య కటక్‌లోని బరామతి స్టేడియంలో తొలి టీ20 జరుగనుంది.
భారత తుది జట్టు అంచనా : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, సంజూ శాంసన్ / జితేశ్ శర్మ(వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా తుది జట్టు అంచనా : క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనొవాన్ ఫెరీరా, కార్బిన్ బాష్, మార్కో యాన్సెస్, క్వెనా మఫాకా, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జి.
🏏 @ShubmanGill completed his recovery at the BCCI Centre of Excellence culminating with skill and fitness training.
In this interaction, he reflects on the world-class facilities at the CoE and how it has shaped his formative years. #TeamIndia pic.twitter.com/aoxMODnB11
— BCCI (@BCCI) December 8, 2025