IPL 2026 | చాన్నాళ్లకు జెర్సీ మారింది.. ఇద్దరిలో అదరగొట్టేది ఎవరు..!
IPL 2026 : తొలి సీజన్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య బిగ్ ఫైట్ జరునుంది. ఐపీఎల్లో రెండు జట్లు తలపడడం కొత్తేమీ కాదు. కానీ, ఈసారి మాత్రం అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.
IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో ఆసక్తికర పోరుకు వేళైంది. తొలి సీజన్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య బిగ్ ఫైట్ జరునుంది. ఐపీఎల్లో రెండు జట్లు తలపడడం కొత్తేమీ కాదు. కానీ, ఈసారి మాత్రం అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం రవీంద్ర జడేజా (Ravindra Jadeja), సంజూ శాంసన్ (Sanju Samson) జెర్సీ మారడమే. సీజన్‌కు ముందు ట్రేడ్ పద్ధతిన సంజూ సీఎస్కే గూటికి చేరగా.. ఆరంభంలో ఆడిన రాజస్థాన్‌కు జడ్డూ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఒకప్పుడు సొంత జట్టుకు పోటీగా ఆడబోతున్న ఈ ఇద్దరు తొలి మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తారోనని అభిమానులు కోటి కళ్లతో వేచి చూస్తున్నారు.
పంతొమ్మిదో సీజన్లో ఫ్రాంచైజీ మారిన ఆటగాళ్లు చాలామందే. కానీ, సంజూ శాంసన్, రవీంద్ర జడేజాలు అందరికంటే ప్రత్యేకం. ఎందుకంటే.. ఒకే జట్టుకు నమ్మకస్తులుగా, మ్యాచ్ విజేతలుగా పేరొందని వీరిద్దరి జెర్సీరంగు మారింది. ట్రేడ్ పద్ధతిలో రూ.18 కోట్లకు సంజూను దక్కించుకున్న చెన్నై సూపర్ సింగ్స్ బదులగా రవీంద్ర జడేజా(రూ.14 కోట్లు), సామ్ కరన్(రూ.2.4కోట్లు)లను ఆ జట్టుకు ఇచ్చేసింది.
Ready, Sanju!🥳#WhistlePodu #RRvCSK pic.twitter.com/H4NFU4Hlmx
— Chennai Super Kings (@ChennaiIPL) March 30, 2026
దాంతో.. శాంసన్, జడేజాలు ఈ సీజన్లో తమ జట్లను గెలిపించాలనే పట్టుదలతో ఉన్నారు. 11 ఏళ్లుగా రాజస్థాన్‌కు ఆడిన సంజూ 5 ఏళ్లు సారథిగా కొనసాగాడు. ఓపెనర్‌గా శుభారంభాలు ఇస్తూ.. సారథిగా రాణించి జట్టును ఓసారి ఫైనల్ చేర్చినా టైటిల్ అందించలేపోయాడు. మరోవైపు జడేజా సీఎస్కే స్టార్‌గా అవతరించి మూడు ట్రోఫీలు గెలుపొందాడు.
2012లో చెన్నై సూపర్ కింగ్స్‌కు
టీమిండియా స్టారైన జడేజా ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ముందు రాజస్థాన్ గూటికి చేరాడు. ఆరంభ ఎడిషన్‌లో దివంగత షేన్ వార్న్ సారథ్యంలో టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడైన జడ్డూ.. 2012లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మారాడు. ధోనీకి కుడి భుజంలా పేరొందిన ఈ ఆల్‌రౌండర్ 2018, 2021, 2023లో సీఎస్కే విజేతగా నిలవడంలో కీలమయ్యాడు. 17 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ రాజస్థాన్‌కు మారిన జడేజాకు కెప్టెన్సీ ఇస్తారనే వార్తలు వినిపించాయి. కానీ, రియాన్ పరాగ్‌కు యాజమాన్యం ఓటేసింది. దాంతో.. ఇంతకుముందు ఎల్లో జెర్సీతో బ్యాటుతో, బంతితో చెలరేగినట్టు ఇప్పుడు గులాబీ జెర్సీలో మెరవాలని జడేజా భావిస్తున్నాడు.
Halla Bol in full force tonight! 💗 pic.twitter.com/7A6ocn6GiW
— Rajasthan Royals (@rajasthanroyals) March 30, 2026
అటు సంజూ, ఇటు జడేజా.. దిగ్గజ ఆటగాళ్లైన ఈ ఇద్దరు ఇప్పుడు తమ పాత జట్టుపై తమ తడాఖా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. గువాహటిలోని బర్సాపర క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు సీఎస్కే, రాజస్థాన్ మ్యాచ్‌లో వీరిద్దరిలో అదరగొట్టేది ఎవరు? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఆల్ ది బెస్ట్ లెజెండ్స్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

