IND vs NZ : నాగ్‌పూర్ టీ20లో ఆరంభంలోనే రెండు బిగ్ వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఓపెనర్ సంజూ శాంసన్(10)ను జేమీసన్ పెవిలియన్ పంపగా, దేశవాళీ క్రికెట్లో దంచేసిన ఇషాన్ కిషన్(8) సైతం నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(16 నాటౌట్), ఓపెనర్ అభిషేక్ శర్మ(31నాటౌట్)లు ఒత్తిడిలోకి లోనవ్వుండా బౌండరీలతో చెలరేగుతున్నారు. క్లార్కే ఓవర్లో అభిషేక్ సిక్స్ బాదగా స్కోర్ 60 దాటింది. సారథి సూర్య సైతం బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో.. 6 ఓవర్లకు స్కోర్..
టాస్ ఓడిన భారత జట్టుకు తన మొదటి ఓవర్లోనే జేమీషన్ షాకిచ్చాడు. ఓపెనర్ సంజూ శాంసన్(10) వికెట్ కోసం ఫీల్డర్‌ను మిడ్‌వికెట్‌కు మార్చి ఫలితం రాబట్టాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్(8) మొదటి బంతినే ఫోర్‌గా మలిచాడు. అయితే.. డఫ్పీ ఓవర్లో మిడ్వికెట్లో ఆడబోయిన అతడు అక్కడే కాచుకొని ఉన్న చాప్మన్ చేతికి చిక్కాడు. దాంతో.. 27 వద్దే రెండో వికెట్ పడింది.
Brisk start, ft. Captain Surya Kumar Yadav and Abhishek Sharma 👏#TeamIndia 68/2 after the powerplay 👌
Updates ▶️ https://t.co/ItzV352OVv#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/271NFWHdWi
— BCCI (@BCCI) January 21, 2026
ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (16 నాటౌట్) ఎదుర్కొన్న మొదటి బంతికే ఫోర్ కొట్టాడు. అనంతరం జేమీసన్ ఓవర్లో అభిషేక్ శర్మ(31 నాటౌట్) స్ట్రెయిట్‌గా భారీ సిక్సర్ సంధించాడు. వీరిద్దరి జోరుతో భారత జట్టు ఆరు ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.