న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్(Samit Dravid).. భారత అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు అతన్ని ఎంపిక చేశారు. అండర్-19 ఆస్ట్రేలియా జట్టుతో.. పుదుచ్చరిలో మూడు వన్డేలు జరగనున్నాయి. సెప్టెంబర్ 21, 23, 26 తేదీల్లో ఆ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ వన్డే సిరీస్‌కు యూపీకి చెందిన మొహమ్మద్ అమన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆ తర్వాత చెన్నై వేదికగా నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు జరగనున్నాయి. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ ఏడో తేదీ వరకు ఆ మ్యాచ్‌లు ఉంటాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన సోహమ్ పట్వర్దన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ సమిత్.. ప్రస్తుతం కేఎస్‌సీఏ మహారాజా టీ20 ట్రోఫీలో మైసూరు వారియర్స్ తరపున ఆడుతున్నాడు. అయితే అతను పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. ఏడు ఇన్నింగ్స్‌లో 82 రన్స్ చేశాడు. 33 హయ్యెస్ట్ స్కోరు. టోర్నీలో అతను ఇంకా బౌలింగ్ చేయాల్సి ఉంది. కూచ్ బిహారీ ట్రోఫీలో సమిత్ కీలక పాత్ర పోషించి కర్నాటక టైటిల్ గెలిచేందుకు తోడ్పడ్డాడు. ఆ టోర్నీలో 18 ఏళ్ల సమిత్.. 8 మ్యాచుల్లో 362 రన్స్ చేశాడు. 16 వికెట్లు తీశాడు.
🚨 NEWS 🚨
India U19 squad and fixtures announced for multi-format home series against Australia U19.
Squad for one-day series: Rudra Patel (VC) (GCA), Sahil Parakh (MAHCA), Kartikeya KP (KSCA), Mohd Amaan (C) (UPCA), Kiran Chormale (MAHCA), Abhigyan Kundu (WK) (MCA), Harvansh…
— BCCI (@BCCI) August 31, 2024