Asia Cup 2023 : ఆసియా కప్‌లో ఆతిథ్య శ్రీలంక(Srilanka) బోణీ కొట్టింది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్(Bangladesh)పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చరిత అసలంక(62 నాటౌట్), సదీర సమరవిక్రమ(54) అర్ధ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చారు. 165 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో లంక తడబడింది. వెంట వెంటనే ఓపెనర్లు దిముత్ కరుణరత్నే(1), ప్రథుమ్ నిస్సంక(14) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. సమరవిక్రమ, అసలంక కీలక భాగస్వామ్యం నిర్మించి లంకను ఆదుకున్నారు. బంగ్లా బౌలర్లలో షకిబుల్ హసన్ రెండు వికెట్లు తీశాడు.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ బంగ్లా 164 పరుగులకే ఆలౌటయ్యింది. లంక బౌలర్లు చెలరేగడంతో బంగ్లా ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆ జట్టు బ్యాటర్లలో నజ్ముల్ హొసేన్ శాంటో(89) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. ఐపీఎల్ పదహారో సీజన్ హీరో యార్కర్ కింగ్ మథీశ పథిరన ధాటికి ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. కొత్త కెప్టెన్ షకిబుల్ హసన్(5) పరుగులతో నిరాశ పరిచాడు. అతడి తర్వాత వచ్చిన వాళ్లు వచ్చనట్టే డగౌట్‌కు చేరారు. థీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు.