సామ్ కరన్‌కు చేదు అనుభవం.. విమానంలో ప్రయాణించేందుకు సిబ్బంది నిరాకరణ
ఇంగ్లాండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌కు చేదు అనుభవం ఎదురైంది. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణించేందుకు సామ్ కరన్‌ను సిబ్బంది అడ్డుకున్నారు. అతనికి కేటాయించిన సీటు విరిగిపోయిందన్న కారణంతో సామ్ కరన్‌ను విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. ఈ విషయాన్ని సామ్ కరన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
Sam Curran | ఇంగ్లాండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌కు చేదు అనుభవం ఎదురైంది. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణించేందుకు సామ్ కరన్‌ను సిబ్బంది అడ్డుకున్నారు. అతనికి కేటాయించిన సీటు విరిగిపోయిందన్న కారణంతో సామ్ కరన్‌ను విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. ఈ విషయాన్ని సామ్ కరన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
‘వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవుతుండగా.. నాకు కేటాయించిన సీటు విరిగిపోయిందని సిబ్బంది చెప్పారు. అందులో మీరు ప్రయాణించడం కుదరదు అని తెలిపారు. ధన్యవాదాలు వర్జిన్ అట్లాంటిక్. ఇలాంటి సంఘటనతో నేను తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఈ ఘటనతో అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు చెప్పింది. ఈ విషయాన్ని తమ హెల్ప్ డెస్క్ దృష్టికి తీసుకొచ్చి ఉంటే.. వారు మరో విమానంలో సీటు కేటాయించేవారు అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సామ్ కరన్ ట్వీట్ వైరల్ అవుతోంది.
గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ 2023 వేలంలో సామ్ కరన్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. టీ 20 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన సామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు దక్కించుకుంది. వేలంలో అతను భారీ ధరకు అమ్ముడుపోవడం ఖాయమని మాజీలు అభిప్రాయపడ్డారు. ఊహించినట్టుగానే సామ్ కరన్‌ను కొనేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరకు పంజాబ్ కింగ్స్ ఈ ఆల్‌రౌండర్ కోసం రూ. 18 కోట్ల భారీ ధర పెట్టింది.
Hi Sam, I am so sorry to hear this – if you have a chat with our team at the help desk they will be more than happy to look into alternative flights for you. You can also send your feedback to our customer care team on customer.care@fly.virgin.com ^Sarah
— virginatlantic (@VirginAtlantic) January 4, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

