Encounter : ఢిల్లీలో శుక్రవారం అర్ధరాత్రి ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో హిమాన్షు భావు గ్యాంగ్‌కు చెందిన అజయ్ అకా గోలి హతమయ్యాడు. ఢిల్లీ పోలీసులు, హిమాన్షు గ్యాంగ్ సభ్యులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఆ గ్యాంగ్ చెందిన ఒక వ్యక్తి హతమయ్యాడని స్పెషల్ సెల్ పోలీస్ అధికారులు ప్రకటించారు. షహబాద్ డెయిరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహిణి సెక్టార్ 29లో కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన పోలీసులు ఈ ఎన్కౌంటర్ చేశారు.
హిమాన్షు భావు గ్యాంగ్‌కు చెందిన మరో సభ్యుడు అభిషేక్ అకా చురాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి ఒక పిస్టల్‌ను, ఆరు లైవ్ క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ హతమైన అజయ్ అకా ఇటీవల తిలక్‌నగర్ కారు షోరూమ్‌పై కాల్పులు జరిపిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇంటెలిజన్స్ పోలీసులకు తారసపడ్డ నిందితులను లొంగిపొమ్మని హెచ్చరించడంతో కాల్పులకు పాల్పడ్డారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు