Renu Desai | రేణు దేశాయ్. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు కేరాఫ్ పవన్ కళ్యాణ్ (Pk)గా ఉండే ఈమె ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. 17 ఏండ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. గతేడాది రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao)సినిమాలో కీ రోల్ ప్లే చేసింది. అయితే ఈ భామ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టిన పవన్ అభిమానులు కామెంట్లు పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా సార్లు ఈ కామెంట్స్‌పై వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే ఇటీవల రేణు దేశాయ్ అనాథ జంతువుల కోసం సర్వీస్ చేస్తున్న విషయం తెలిసిందే. అనాథ జంతువులను ఆదుకోవడానికి ఎన్జీవోలకు సహకారం అందిస్తుంది. తాజాగా దీనిపై పవన్ కళ్యాణ్ అభిమాని స్పందిస్తూ.. మీరు కూడా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ లాగా గోల్డెన్ హార్ట్ అని కామెంట్ చేశాడు.
ఈ కామెంట్‌పై చిర్రెత్తుకొచ్చిన రేణు దేశాయ్ తాజాగా స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది. నా పోస్టుల కింద ప్రతిసారి నా ఎక్స్ హస్బెండ్ ప్రస్తావనను ఎందుకు తీసుకువస్తున్నారు. ప్రతిసారి పవన్ కళ్యాణ్‌ను నా లైఫ్‌లోకి తీసుకువచ్చి కంపేర్ చేయకండి. ఇలా చేస్తున్న చాలామందిని ఇప్పటికే బ్లాక్ చేశాను. అయిన కూడా మళ్లీ అలానే చేస్తున్నారు. నేను ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నాను. నాకు పదేళ్లు ఉన్నప్పటి నుంచి నేను యానిమల్ సర్వీస్ చేస్తున్నాను దీనికి నా ఎక్స్ హస్బెండ్ కి సంబంధం లేదు. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇలా ప్రతి పోస్టుకి కామెంట్ చేసి నన్ను ఆయనతో కంపేర్ చేసి ఇబ్బంది పెట్టకండి.
ఆయన నాలాగా జంతువులపై ప్రేమ, కేరింగ్ చూపించడు అంటూ రాసుకోచ్చింది.