ENG vs NEP : టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో కొద్దిలో ఓటమి నుంచి తప్పించుకుంది ఇంగ్లండ్. ఉత్కంఠ పోరులో నేపాల్ బ్యాటర్ల విజృంభణతో ఓటమి అంచున నిలిచిన మాజీ ఛాంపియన్ ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో గట్టెక్కింది. దీపేంద్ర సింగ్ ఐరీ(44) కెప్టెన రోహిత్ పౌడెల్(39) ల మెరుపులతో విజయానికి చేరువైన ప్రత్యర్థికి చివరి ఓవర్లో 10 రన్స్ అవసరమవ్వగా.. సామ్ కరన్(1-27) 5 రన్స్ మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. సిక్సర్లతో చెలరేగి నేపాల్‌ను విజయతీరాలకు చేర్చిన లోకేష్ బామ్(39 నాటౌట్) కరన్ సంధించిన యార్కర్లను బౌండరీలుగా మలచలేకపోయాడు. దాంతో.. 4 పరుగుల తేడాతో బతికిపోయిన ఇంగ్లండ్ పాయింట్ల ఖాతా తెరిచింది.
పొట్టి ప్రపంచకప్‌లో నేపాల్ సంచలనం సృష్టించే అవకాశాన్ని చేజార్చుకుంది. వాంఖడేలో స్వదేశీ అభిమానుల మద్ధతుతో చెలరేగిన ఆసియా జట్టు.. బలమైన ఇంగ్లండ్‌ను 184కే కట్టడి చేసింది. ఓపెనర్లు తేలిపోవడంతో కుర్రాడు జాకబ్ బెథెల్(55), హ్యారీ బ్రూక్(53), విల్ జాక్స్ (39నాటౌట్) రాణించారు.
That was… INCREDIBLE!https://t.co/Xdrm4WGl1V | #T20WorldCup pic.twitter.com/OlZBZGOT4e
— ESPNcricinfo (@ESPNcricinfo) February 8, 2026
అనంతరం భారీ ఛేదనలో నేపాల్‌కు ఓపెనర్ కుశాల్ భ్రుటెల్(29) శుభారంభమివ్వగా.. మిడిల్ ఓవర్లలో ఇంగ్లండ్ స్పిన్నర్లను దీపేంద్ర సింగ్ ఐరీ(44), సారథి రోహిత్ పౌడెల్(39) ధీటుగా ఎదుర్కొన్నారు. వీరిద్దరి జోరుతో గెలుపు దిశగా సాగిన నేపాల్‌ను సామ్ కరన్ దెబ్బకొట్టాడు. కేవలం రెండే పరుగులిచ్చి డేంజరస్ దీపేంద్రను ఔట్ చేశాడు. ఆ తర్వాత పౌడెల్ సైతం వెనుదిరిగాడు. మ్యాచ్ ఇంగ్లండ్ వైపు తిరిగిన వేశ లోకేష్ బామ్(39 నాటౌట్) బ్రూక్ సేనకు ముచ్చెమటలు పట్టించాడు.
ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన లోకేశ్ నేపాల్ శిబిరంలో ఆశలు రేపాడు. అనంతరం.. ల్యూక్ వుడ్ ఓవర్లో తొలి బంతికే కీపర్ వెనకాల బౌండరీ రాబట్టిన అతడు.. మూడో బంతిని మిడాఫ్‌లో ఫోర్‌గా మలిచాడు. కానీ, ఆఖరి బంతికి వుడ్ యార్కర్‌కు గుల్షన్ జా బౌల్డయ్యాడు.
Nepal fans will remember this knock for a long time 💔❤️🩹 pic.twitter.com/UHOUrqqdtJ
— ESPNcricinfo (@ESPNcricinfo) February 8, 2026
చివరి ఓవర్లో విజయానికి 10 రన్స్ అవసరమవ్వగా.. రెండో బంతికి సింగిల్ వచ్చింది. మూడో బంతికి కరన్ కేసీ(1 నాటౌట్) సింగిల్ తీశాడు. నాలుగో బంతికి రెండు రన్స్.. ఐదో బంతి యార్కర్ వేశాడు సామ్ కరన్. చివరిబంతికి ఆరు రన్స్ కొట్టాల్సిరాగా.. ఒకే ఒక పరుగు వచ్చింది. నాలుగు రన్స్ తేడాతో బతికిపోయిన ఇంగ్లండ్ గ్రూప్ సీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
వాంఖడేలో నేపాల్ బౌలర్లను ఉతికేస్తూ యువకెరటం జాకబ్ బెథెల్(55), కెప్టెన్ హ్యారీ బ్రూక్(53)లు అర్ధ శతకాలతో కదం తొక్కారు. ఓపెనర్లు విఫలమైనా బెథెల్ మెరుపులతో కోలుకున్న జట్టుకు బ్రూక్ వెన్నెముకలా నిలిచాడు. మిడిల్ ఓవర్లలో భారీ షాట్లతో విరుచుకుపడి స్కోర్‌బోర్డును ఉరికించాడు. ఆఖర్లో విల్ జాక్స్(37 నాటౌట్) నాలుగు సిక్సర్లతో విజృంభించగా నిర్ణీత ఓవర్లలో ఇంగ్లండ్ 184 పరుగులు చేసింది.