హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈనెల 12న హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌కు శనివారం నుంచి ఆన్లైన్లో టికెట్లు విక్రయించనున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్ మోహన్‌రావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పేటీఎం ఇన్సైడర్ వెబ్సైట్/ఆప్‌లో టికెట్లను విక్రయించనున్నట్టు పేర్కొన్నారు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్లను ఈనెల 8 నంచి 12 దాకా జింఖానా మైదానంలో రిడంప్షన్ చేసుకోవాలని సూచించారు. ఆఫ్‌లైన్‌లో టికెట్లను విక్రయించడం లేదని ఆయన స్పష్టం చేశారు.