బాలీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు మరో టోర్నీకి సిద్ధమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కొల్లగొట్టాక ఆటకు బ్రేక్ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి.. తిరిగి టైటిల్ వేట ఆరంభించేందుకు ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీని వేదికగా మలుచుకోవాలని భావిస్తున్నది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో సింధు.. మూడో సీడ్‌గా బరిలోకి దిగనుండగా.. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ పోటీ పడుతున్నారు. గాయాల కారణంగా సైనా నెహ్వాల్, సమీర్ వర్మ ఈ టోర్నీకి దూరమయ్యారు.