ఢిల్లీ: బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్ సైకియా నియమితులయ్యారు. ఇన్నాళ్లూ ఆ పదవిలో జై షా కొనసాగగా ఈనెల 1న ఆయన ఐసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన నేపథ్యంలో సెక్రటరీ పోస్ట్ నుంచి వైదొలిగారు. సైకియా బీసీసీఐలో జాయింట్ సెక్రటరీగా కొనసాగుతుండగా తాజాగా అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆయనను తాత్కాలిక కార్యదర్శిగా నియమించారు. బీసీసీఐకి పూర్తి స్థాయిలో కార్యదర్శి నియమితుడయ్యేవరకూ సైకియా ఈ పదవిలో (నిబంధనల ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ దాకా) కొనసాగనున్నారు.