న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో సాయి సుదర్శన్(Sai Sudharsan) అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ఆ క్యాచ్‌తో అందర్నీ స్టన్ చేశాడు. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సుదర్శన్.. వాస్తవానికి బ్యాటర్ కొట్టిన భారీ షాట్ నుంచి తప్పించుకోబోయాడు. కానీ ఆ బంతి సుదర్శన్ చేయికి తగిలి, అతని చేతుల్లోనే ఉండిపోయింది. ఈ ఘటనతో షాక్‌లోకి వెళ్లిపోయాడు బ్యాటర్ జాన్ క్యాంప్‌బెల్. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది.
— .. (@OnXtotroll) October 11, 2025
లెన్త్‌లో పడిన బంతిని.. బలంగా స్వీప్ చేశాడు క్యాంప్‌బెల్. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సుదర్శన్ కాస్త ముందుకు వంగి ఉన్నాడు. ఆ షాట్ కొట్టిన సమయంలో అతను బంతి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ ఆ బంతి నేరుగా అతని చేతుల్లోకి వెళ్లడం , ఆ వేగంలో అతను దాన్ని పట్టుకోవడం ఓ ఆశ్చర్యంగా జరిగిపోయింది.