హైదరాబాద్, ఆట ప్రతినిధి : బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియా అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రి టోర్నీలో రాష్ర్టానికి చెందిన సాయికిరణ్ కాంస్య పతకంతో మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో సాయికిరణ్.. ఇనుపగుండును 15.15 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. సాయికిరణ్‌ను జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్ ప్రత్యేకంగా అభినందించాడు.