హైదరాబాద్, ఆట ప్రతినిధి: వరల్డ్ టూర్ ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో భారత యువ జోడీ సాయికార్తీక్రెడ్డి, విష్ణువర్ధన్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో కార్తీక్, విష్ణువర్ధన్ ద్వయం 7-6(7-4), 3-6, 7-10 తేడాతో కొరియా జంట యాంగ్సియోక్ జియాంగ్, సంగ్ పార్క్ చేతిలో ఓటమిపాలైంది.
తొలి సెట్‌ను గెలుచుకున్న కార్తీక్ జోడీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. ప్రత్యర్థి పుంజుకుని పోటీలోకి రావడంతో మ్యాచ్‌ను చేజార్చుకుంది.