ఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నెలకొన్న ఎల్పీజీ కొరత సెగ స్పోర్ట్స్ అథారిటీ ఇండియా (సాయ్)నూ తాకింది. ఢిల్లీలో ఉన్న సాయ్ ప్రధాన కార్యాలయంలోని క్యాంటీన్ ఎల్పీజీ కొరత వల్ల రెండు వారాలుగా మూసివేసినట్టు సమాచారం. ఈ క్యాంటీన్ ప్రధానంగా సాయ్‌లో పనిచేస్తున్న సుమారు 150 మందికిపైగా స్టాఫ్ కోసం కేటాయించింది.
గ్యాస్ కొరత కారణంగా పదిహేను రోజుల నుంచి ఇండక్షన్ స్టవ్‌పై టీ మాత్రమే అందిస్తుండగా మిగిలిన ఆహారం కోసం సిబ్బంది పక్కనున్న హోటల్స్‌కు వెళ్తున్నారు. సిలిండర్లు దొరక్కపోవడంతో పాటు అధిక ధర కారణంగా వాటిని కొనలేకపోతున్నామని, అందుకే క్యాంటీన్‌ను మూసిఉంచినట్టు వినికిడి. అయితే స్టాఫ్ క్యాంటీన్ మూసిఉన్నా అథ్లెట్లకు ఆహారాన్ని అందించే క్యాంటీన్ మాత్రం సజావుగానే సాగుతుందని సాయ్ వర్గాలు తెలిపాయి.