కొలంబో: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (సాఫ్) ఆధ్వర్యంలో కొలంబో వేదికగా జరుగుతున్న అండర్-17 చాంపియన్‌షిప్స్‌లో యువ భారత జట్టు సెమీస్‌కు ప్రవేశించింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం క్వార్టర్స్‌లో భారత్.. 1-0తో భూటాన్‌పై గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.
సోమవారం భారత జట్టు సెమీస్‌లో పాక్‌తో తలపడనుంది. భూటాన్‌తో మ్యాచ్‌లో రహాన్ అహ్మద్.. 57వ నిమిషంలో గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.