Sachin Tendulkar : భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 28న జరుగబోయే నూతన కార్యవర్గం ఎంపికకు త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ పదవి కోసం పలువురు మాజీ క్రికెటర్లు పోటీ పడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లలో వెటరన్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కూడా ఉన్నాడని సమాచారం. మరి.. ఈ ఊహాగానాలపై మాస్టర్ బ్లాస్టర్ టీమ్ ఏం చెప్పిందో తెలుసా..?
వయోపరిమితి దాటడంతో రోజర్ బిన్ని బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగాడు. దాంతో.. తాత్కాలిక బాస్‌గా రాజీవ్ శుక్లా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28న కొత్త కార్యవర్గం కోసం ఎన్నికలు జరుగనున్నాయి. మాజీ ఆటగాళ్లు బీసీసీఐ పగ్గాలు చేపట్టడం కొత్తేమీ కాదు. గతంలో శివలాల్ యాదవ్, సునీల్ గవాస్కర, సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నిలు భారత బోర్డు అధ్యక్షులుగా పని చేశారు. ఈ ఎలక్షన్స్‌లో సచిన్ 37వ అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతున్నాడనే కథనాలు మీడియాలో వస్తున్నాయి. సో.. అతడి టీమ్ అవన్నీ వదంతులే అంటూ వివరణ ఇచ్చింది.
🚨RUMOURS PUT TO REST🚨
Sachin Tendulkar’s team has issued a statement dismissing rumours of him being in contention to become the next BCCI president. pic.twitter.com/2dyzbxEuhf
— Cricbuzz (@cricbuzz) September 11, 2025
‘బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్నికల్లో సచిన్ టెండూల్కర్ పోటీ చేస్తున్నాడని, నామినేట్ అయ్యాడని పలు విధాలుగా వార్తలు, వదంతలు వ్యాపించడం నా దృష్టికి వచ్చాయి. ప్రస్తుతానికైతే ఆయన అలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాబోయే ఎన్నికల్లో సచిన్ పోటీ చేయడం లేదు’ అని సచిన్ మేనేజ్మెంట్ టీమ్ వెల్లడించింది. దాంతో.. క్రికెట్ రాజకీయాల్లో జోక్యం చేసుకునేందుకు సచిన్ ఆసక్తి చూపడం లేదనే విషయం మాత్రం స్పష్టమైంది.
పదహారేళ్లకే అరంగేట్రం నుంచి.. కెరీర్ ఆసాంతం వివాదరహితుడిగా పేరొందిన ఈ లెజెండ్ 2013లో వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మెంటర్‌గా వ్యవహరించాడు సచిన్. భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన ఈ వెటరన్‌ను అప్పటి రాష్ట్రపతి రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేశారు. 2012 నుంచి 2018 వరకూ ఈ క్రికెట్ గాడ్ ఎంపీగా కొనసాగాడు.
Sachin in 3D action figures trend 🤩⏩#3DActionFigures #SachinTendulkar #MasterBlaster #Trending pic.twitter.com/LDuYmfkR8j
— 100MB (@100MasterBlastr) September 10, 2025