Sachin Tendulkar | ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్స్ పోరుకు ఆసన్నమైంది. గతనెల 20న ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్.. ప్రతీ మ్యాచ్ ఫ్యాన్స్‌కు కావాల్సినంత మజాను అందిస్తూ దూసుకెళ్తోంది. ఊహించని మలుపులతో మెగాటోర్నీ థ్రిల్లర్‌ను తలపిస్తూ.. అభిమానుల్ని కట్టిపడేస్తోంది. భారత్ ఈ టోర్నీలో పాల్గొనకపోయినా.. దేశంలో ఫుట్‌బాల్ ఫీవర్ పట్టుకుంది. అభిమానులు ఈ టోర్నీని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు.
అభిమానులకే కాదు టీమిండియా దిగ్గజం, బ్యాటింగ్ గ్రేట్ సచిన్ తెందూల్కర్‌కు సైతం ఫిఫాపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఫుట్‌బాల్ అడుతున్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు. వీడియోలో సచిన్ ఎంతో ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించారు. వీడియో షేర్ చేసిన సచిన్ ‘ఫుట్‌బాల్ ఆన్ మై మైండ్..’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సచిన్ ఆటతీరుకు మురిసిపోతున్నారు. ఈ వయసులోనూ మీరు ఎంతో చలాకీగా ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.