T20 World Cup-2022 | ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ సమరం ఆరంభమైంది. గ్రూప్‌స్టేజ్ మ్యాచ్‌లు శుక్రవారంతో పూర్తికానుండగా.. ఈ నెల 22 నుంచి సూపర్-12 మ్యాచ్‌లు మొదలవనున్నాయి. ఇందులో గెలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్‌కు వెళ్లనున్నాయి. క్రికెట్ పండితులతో పాటు దిగ్గజ మాజీ ఆటగాళ్లు సైతం ఏయే జట్లు సెమీఫైనల్స్‌కు వెళ్లే అవకాశాలున్నాయో అంచనాలు వేయగా.. భారత లెజెండరీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సైతం సెమీఫైనల్స్‌కు వెళ్లే జట్లు ఏంటో అంచనా వేశాడు.
ఇందులో టీమిండియాతో పాటు దాయాది పాక్ జట్టు సైతం ఉన్నది. అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్స్‌కు వెళ్లే అవకాశాలున్నాయని, అయితే, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సైతం ఆయా గ్రూప్స్‌లో డార్క్ హార్స్‌గా సచిన్ తెలిపాడు. ఆయా జట్ల ఫామ్‌ను బట్టి అంచనా వేసినట్లు పేర్కొన్నాడు. అయితే, తాను మాత్రం స్పష్టంగా భారత్ చాంఫియన్‌గా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ఈ నెల 23న పాక్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుండగా.. టీమిండియాకే గెలుపు అవకాశాలున్నాయని సచిన్ చెప్పాడు.
భారత్‌కు మంచి అవకాశాలున్నాయని, జట్టు బ్యాలెన్స్డ్గా ఉందని వివరించారు. అయితే, మెగాటోర్నీకి జస్ప్రీత్ బూమ్రా దూరమవడంపై స్పందించాడు. అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో అతనూ ఒకడని, బూమ్రా లేకపోవడంతో స్పష్టంగా జట్టుపై ప్రభావం చూపుతుందన్నాడు. ప్లేయింగ్ 11లో బూమ్రా కీలక ఆటగాడన్న సచిన్.. జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఉండడం సానుకూల విషయమని చెప్పాడు. మహ్మద్ షమీ సైతం అనుభవజ్ఞుడు, సమర్థుడని.. మెగా టోర్నీలో రాణించగలుగుతాడని క్రికెట్ దేవుడు వివరించారు.