గురువారం 04 మార్చి 2021
Sports - Jan 19, 2021 , 13:32:13

అత్య‌ద్భుత సిరీస్ విజ‌యాల్లో ఇదీ ఒక‌టి: స‌చిన్‌

అత్య‌ద్భుత సిరీస్ విజ‌యాల్లో ఇదీ ఒక‌టి: స‌చిన్‌

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన టీమిండియాపై ప్ర‌శంస‌లు కురిపించాడు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్క‌ర్‌. బ్రిస్బేన్ కోట‌ను టీమిండియా బ‌ద్ధ‌లు కొట్ట‌గానే ట్విట‌ర్‌లో త‌న ఆనందాన్ని పంచుకున్నాడు. గ్రేటెస్ట్ సిరీస్ విజ‌యాల్లో ఇదీ ఒక‌ట‌ని మాస్ట‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ సిరీస్‌లో ప్ర‌తి సెష‌న్‌కు ఓ హీరో దొరికాడ‌ని మాస్ట‌ర్ అన్నాడు. దెబ్బ త‌గిలిన ప్ర‌తిసారీ బ‌లంగా నిల‌బ‌డ్డాం. భ‌యం లేని క్రికెట్ ఆడాం. గాయాలే, అనిశ్చితులు ఆత్మ‌విశ్వాసాన్నే పెంపొందించాయి. ఇది గ్రేటెస్ట్ సిరీస్ విజ‌యాల్లో ఒక‌టి. కంగ్రాట్స్ ఇండియా అని స‌చిన్ ట్వీట్ చేశాడు.

VIDEOS

logo