Ball Of The Series : అండరన్స్ – టెండూల్కర్ ట్రోఫీలో నిప్పులు చెరిగిన మహ్మద్ సిరాజ్ మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) షాకిచ్చాడు. మియా భాయ్‌కు తగిన గుర్తింపు రాలేదని అభిప్రాయపడిన సచిన్.. భారత జట్టు చరిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన అతడిని కాదని ఆకాశ్ దీప్ (Akash Deep)ను ఎంచుకున్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ‘బాల్ ఆఫ్ ది సిరీస్’ (Ball Of The Series)గా ఆకాశ్‌కే ఓటేశాడు మాస్టర్ బ్లాస్టర్. జో రూట్‌ను బౌల్డ్ చేసిన బంతినే మాస్టర్ బ్లాస్టర్ బాల్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పాడు. అలా అని సిరాజ్‌ను ప్రతిభను తాను తక్కవు చేయడం లేదని సచిన్ తాజాగా ఒక వీడియోలో వెల్లడించాడు.
బర్మింగ్హమ్లో జరిగిన రెండో టెస్టులో గిల్ సేన సూపర్ విక్టరీతో సిరీస్ సమం చేసింది. ఆ మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ క్రీజులో పాతుకుపోయిన జో రూట్‌ను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆకాశ్ సంధించిన ఆ బంతినే సచిన్ బాల్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపిక చేశాడు. ‘నా దృష్టిలో జో రూట్‌ను బౌల్డ్ చేసిన ఆకాశ్ దీప్ బంతి అద్భుతం. అతడి వికెట్ తీయడం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆకాశ్ విసిరిన బంతిని కాస్త ఆలస్యంగా ఆడాడు రూట్. భీకర ఫామ్‌తో పాటు టన్నుల కొద్దీ పరుగులు బాదిన రూట్‌ను ఔట్ చేయడం ద్వారా భారత జట్టు విజయావకాశాలు పెరిగాయి. అందుకే.. ఆ బంతిని బాల్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంచుకున్నా’ అని సచిన్ వివరించాడు.
𝐑𝐨𝐨𝐭 𝐟𝐚𝐥𝐥𝐬 𝐭𝐨 𝐃𝐞𝐞𝐩 🥶#AkashDeep uproots #JoeRoot with a searing in-swinger, his second wicket puts England firmly on the back foot 🤩#ENGvIND 👉 2nd TEST, Day 4 | LIVE NOW on JioHotstar ➡ https://t.co/2wT1UwEcdi pic.twitter.com/avu1sqRrcG
— Star Sports (@StarSportsIndia) July 5, 2025
ఓవల్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో ‘మ్యాచ్ విన్నర్’గా నిలిచిన సిరాజ్‌ను ఆకాశానికెత్తేశాడు. ‘ఐదు టెస్టుల సిరీస్‌లో సిరాజ్ ప్రదర్శన నమ్మశక్యం అనిపించలేదు. చాలా గొప్పగా బౌలింగ్ చేశాడు. అతడి ఆటిట్యూడ్ నాకెంతో నచ్చింది. అతడి పాదాలలో ఉన్న లయ, వేగం చాలా నచ్చాయి. నిలకడగా లైన్ అండ్ లెంగ్త్‌తో ఆఖరి రోజు సిరాజ్ సూపర్ స్పెల్ వేశాడు. సిరీస్‌లో అప్పటికే 1,000కి పైగా బంతులు వేసిన అతడు.. ఐదో రోజు కూడా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడని కామెంటేటర్లు చెప్పగా విన్నాను. అతడి ధైర్యం, జట్టును గెలిపించాలనే అతడి కసి అద్భుతం.
జట్టుకు అవసరమైన ప్రతిసారి సిరాజ్ నేనున్నానంటూ ముందుకొస్తాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ కెప్టెన్ బౌలర్ అనిపించుకుంటాడు. గతంలో చేసినట్టే ఈ సిరీస్‌లోనూ ఈ పేస్ గన్ తన సత్తా చాటాడు. సిరీస్‌లో అతడు తీసిన వికెట్లే అందుకు నిదర్శనం. ఎంతో ప్రతిభ ఉన్నా సరే సిరాజ్‌కు మాత్రం తగినంత గుర్తింపు రాలేదు అని టెండూల్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
A moment of joy.⁰A moment in history.⁰Prasidh Krishna and Mohammed Siraj—what a bowling duo!⁰What a match. What an effort from Chris Woakes.⁰Everything was exceptionally beautiful.#INDvsENG #INDvsENGTest #OvalTest #Siraj #TeamIndia
— Kavya Maran (@Kavya_Maran_SRH) August 4, 2025