సిన్సినాటి (యూఎస్) : డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సిన్సినాటి ఓపెన్ బరిలోకి దిగిన టాప్ సీడ్ అరీనా సబలెంకకు మూడో రౌండ్లో గట్టిపోటీ ఎదురైంది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో సబలెంక.. 7-6 (7/3), 4-6, 7-6 (7/5)తో ఎమ్మా రడుకాను (బ్రిటన్)ను ఓడించింది.
సుమారు మూడు గంటల పాటు హోరాహోరీగా సాగిన పోరులో గెలుపు కోసం సబలెంక, రడుకాను పోరాడినా నిర్ణయాత్మక మూడో సెట్ టైబ్రేక్‌లో బ్రిటన్ అమ్మాయి పట్టు విడిచింది. సబలెంకతో పాటు స్వియాటెక్, రిబాకినా, కీస్ కూడా నాలుగో రౌండ్ చేరారు.