SA Vs NZ | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాకు న్యూజిలాండ్ 363 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. లాహోర్ నేషనల్ గడాఫీ స్డేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇదే టోర్నీలో ఇంగ్లాండ్‌పై ఐదు వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసిన ఆస్ట్రేలియా రికార్డును న్యూజిలాండ్ అధిగమించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరాలంటే.. సరికొత్త చరిత్ర సృష్టించడంతో పాటు పాత రికార్డులన్నీ బద్దలు కొట్టాల్సిందే. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు 48 పరుగుల వద్ద తొలి షాక్ తగిలింది. 21 పరుగులు చేసి విల్ యంగ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ రెండో వికెట్‌కు 164 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్స్ (102) సెంచరీలతో కదం తొక్కారు.
రచిన్ కి వన్డేల్లో ఐదో సెంచరీ కావడం విశేషం. 101 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 108 పరుగులు చేశాడు. విలియమ్సన్ వన్డేల్లో 15వ సెంచరీని పూర్తి చేవాడు. 94 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 102 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ వీరిద్దరు అవుట్ అయ్యాక టామ్ లాథమ్ నాలుగు పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అయితే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ బెస్ట్ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోరును 300 దాటించారు. మిచెల్ తృటిలో అర్ధ సెంచరీకి దూరమ్యాడు. కేవలం 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 49 పరుగులు చేసి అవుటయ్యాడు. అదే సమయంలో, మైఖేల్ బ్రేస్‌వెల్ 12 బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఫిలిప్స్ చివరి వరకు ఆడి 27 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ రెండు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున లుంగీ ఎంగిడీ మూడు వికెట్లు పడగొట్టగా, కగిసో రబాడా రెండు, వియాన్ ముల్డర్ ఒక వికెట్ దక్కింది.